కర్నూలులో ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన 27వ ఫెడరేషన్ కప్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో బాలుర విభాగంలో ఏపీ జట్టు రజత పతకం సాధించింది.
ఏపీ త్రోబాల్ జట్టుకు అభినందన
Aug 31 2016 11:43 PM | Updated on Aug 18 2018 8:54 PM
విజయవాడ స్పోర్ట్స్ :
కర్నూలులో ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన 27వ ఫెడరేషన్ కప్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో బాలుర విభాగంలో ఏపీ జట్టు రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ జట్టును జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎండీ సిరాజుద్దీన్, త్రోబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గరిమెళ్ల నానయ్య చౌదరి అభినందించారు. ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులు ఎ.అఖిల్, ఎం.అఖిలేష్, బి.సందీప్‌లను ప్రత్యేకంగా అభినంధించారు. కార్యక్రమంలో ఎస్‌ఏఎస్ కళాశాల పీడీ, త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.సులోచ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాము పాల్గొన్నారు.
Advertisement
Advertisement