సీఎం స్టార్హోటల్ లో ఉంటే తప్పేంటి?: ఏపీ మంత్రి | ap ministers comments on rajyasabha candidates | Sakshi
Sakshi News home page

సీఎం స్టార్హోటల్ లో ఉంటే తప్పేంటి?: ఏపీ మంత్రి

May 26 2016 6:46 PM | Updated on Mar 23 2019 9:03 PM

సీఎం స్టార్హోటల్ లో ఉంటే తప్పేంటి?: ఏపీ మంత్రి - Sakshi

సీఎం స్టార్హోటల్ లో ఉంటే తప్పేంటి?: ఏపీ మంత్రి

సీఎం కుటుంబం స్టార్ హోటల్ లో ఉంటే తప్పేంటి, ఓ ముఖ్యమంత్రి రూ. 2 లక్షల అద్దె చెల్లించకూడదా? ..

విజయవాడ: ముఖ్యమంత్రి కుటుంబం స్టార్ హోటల్లో ఉంటే తప్పేంటని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాను ఎదురు ప్రశ్నించారు.  ఓ ముఖ్యమంత్రి రూ. 2 లక్షల అద్దె చెల్లించకూడదా అన్నారు. ఈ విషయంపై మీడియా, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఫాంహౌస్ కు ప్రభుత్వమే నిధులు ఖర్చుచేసిన మాట వాస్తవమే అని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక రకరకాల అభియోగాలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరిని కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. సుజానా చౌదరి విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రులు అచ్చెన్ననాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement