‘శాతకర్ణి’కి సర్కారు దాసోహం | ap government help to Balakrishna Gautamiputra Satakarni movie | Sakshi
Sakshi News home page

‘శాతకర్ణి’కి సర్కారు దాసోహం

Jan 24 2017 2:49 AM | Updated on Aug 29 2018 1:59 PM

‘శాతకర్ణి’కి సర్కారు దాసోహం - Sakshi

‘శాతకర్ణి’కి సర్కారు దాసోహం

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సాగిలపడేందుకు సన్నాహాలు చేస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన చేయకుండానే గౌతమిపుత్ర శాతకర్ణి

సాక్షి, అమరావతి: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సాగిలపడేందుకు సన్నాహాలు చేస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన చేయకుండానే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ నెల 9వ తేదీనే 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూటికి నూరు శాతం వినోదపు పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement