మూడు సంవత్సరాల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి తులసిరెడ్డి అన్నారు.
అవినీతీలో ఏపీ ఫస్ట్
Jun 13 2017 11:17 PM | Updated on Sep 22 2018 8:25 PM
టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ తులసిరెడ్డి
బేతంచెర్ల : మూడు సంవత్సరాల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గన సీతారామిరెడ్డి స్వగృహంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలోపార్టీ విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. నోట్ల రద్దు , ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ వ్యవస్థ తీరు చూస్తుంటే ప్రచార అర్భాటానికే కేంద్ర ప్రభుత్వం పరిమితమైందన్నారు. రాష్ట్రంలో నీరు చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఎ న్నికల హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అందుకు అద్దంకి, పత్తికొండ, ప్రొద్దుటూరులో జరిగిన హత్య సంఘటనలే నిదర్శనమని చెప్పారు.
Advertisement
Advertisement