రాష్ట్రంలో బీఈడీ కళాశాలలో ప్రవేశానికి ఆగస్టు 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ –2106 వెబ్ కౌన్సెలింగ్‌ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్‌కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 8 నుంచి ఎపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
యూనివర్సిటీక్యాంపస్(తిరుపతి): రాష్ట్రంలో బీఈడీ కళాశాలలో ప్రవేశానికి ఆగస్టు 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ –2106 వెబ్ కౌన్సెలింగ్‌ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్‌కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు ఈనెల చివరి వారంలో జరగాల్సిన కౌన్సెలింగ్‌ను ఆగస్టు 8వతేదికి వాయిదా వేశామన్నారు. రాష్ట్రంలోని వివిధ బీఈడీ కళాశాలల వివరాలను సంబంధిత యూనివర్సిటీలు పంపకపోవడం, కొన్ని కళాశాలలు పీ రెగ్యులేటరీ కమిషన్‌ను సంప్రదించకపోవడంతో కౌన్సిలింగ్‌వాయిదా పడిందన్నారు. ఆగస్టు 8 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 8, 9, 10 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, 9, 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 16వతేది సీట్ల కేటాయింపు పూర్తి చేసి 17 నుంచి తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్ రోజుకు పీ రెగ్యులేటరీ కమిషన్‌ను సంప్రదించని కళాశాలలకు అడ్మిషన్ ప్రక్రియ నిలిపివేస్తామని చెప్పారు.