ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకయ్య గుండెపోటుతో మృతిచెందారు. లోక్నాయక్ ఆస్పత్రిలో ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నివాళులర్పించారు.
ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో 300మంది కాంగ్రెస్ నేతలు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా అమలు డిమాండ్తో చేపట్టిన కోటి సంతకాలను రఘువీరా నేతృత్వంలో ప్రధాని మోదీకి సమర్పించనున్నారు.