ఎస్వీయూ దూరవిద్యా పరీక్ష వాయిదా | Ap bandh : Exam postponed | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ దూరవిద్యా పరీక్ష వాయిదా

Sep 9 2016 6:24 PM | Updated on Sep 4 2017 12:49 PM

ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలోని 59 కేంద్రాల్లో జరుగుతున్న పీజీ, యూజీ పరీక్షల్లో భాగంగా శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు దూరవిద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంపీ.నరసింహరాజు తెలిపారు.

తిరుపతి, యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలోని 59 కేంద్రాల్లో జరుగుతున్న పీజీ, యూజీ పరీక్షల్లో భాగంగా శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు దూరవిద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంపీ.నరసింహరాజు తెలిపారు.

శనివారం ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేశామన్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. వాయిదా పడిన పరీక్షను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement