ఏవోబీలో భయం.. భయం | AOB point checking police for maoists party Anniversary | Sakshi
Sakshi News home page

ఏవోబీలో భయం.. భయం

Sep 21 2017 10:59 AM | Updated on Mar 28 2019 5:07 PM

ముంచంగిపుట్టులో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు - Sakshi

ముంచంగిపుట్టులో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ఆంధ్ర–ఒడిశా సరి హద్దు ప్రాంతంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నేటి నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవం
తనిఖీలు, కూంబింగ్‌ ముమ్మరం


ముంచంగిపుట్టు(అరకులోయ) : ఆంధ్ర–ఒడిశా సరి హద్దు ప్రాంతంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు పార్టీ 13వ వార్షికోత్స వం నేపథ్యంలో ఏవోబీ వేడెక్కింది. పోలీసు బలగాలన్నీ ఏవోబీ వైపు కదిలాయి. మండల కేంద్రంలో ఎస్‌ఐ అరుణ్‌కిర ణ్‌ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కుమడ, జోలాపుట్టు, డుడుమ ప్రాంతాల నుంచి వాహనాలను తనిఖీలు కొనసాగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా మవోయిస్టు పార్టీ హిట్‌లిస్టులో ఉన్నా ప్రజా ప్రతినిధులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

ప్రభుత్వ కార్యాలయాల వద్ద సాయుధ పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేశారు.   సరిహద్దుల్లో పోలీసు బలగాలతో కూంబింగ్‌ ముమ్మరం చేశారు.   సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కొన్ని రోజులుగా బ్యానర్లు కట్టి, కరపత్రాలు వెదజల్లుతున్నారు.  ఏవోబీలో ఎప్పుడు ఎటువంటి సంఘటన చోటు చేసుకుంటుందోనని మారుమూల గిరి గ్రామల గిరిజనులు భయాందోళనకు గురువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement