చెలరేగిన అనంత బ్యాట్స్‌మెన్లు | anantapur team batsmen talent | Sakshi
Sakshi News home page

చెలరేగిన అనంత బ్యాట్స్‌మెన్లు

Sep 1 2017 9:25 PM | Updated on Oct 20 2018 6:19 PM

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరుగుతున్న అండర్‌–16 సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అనంత బ్యాట్స్‌మెన్లు చెలరేగారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరుగుతున్న అండర్‌–16 సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అనంత బ్యాట్స్‌మెన్లు చెలరేగారు. గ్రూప్‌–బీలో భాగంగా రెండో సెమీస్‌ మ్యాచ్‌లో తూర్పుగోదావరి, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 95 ఓవర్లలో 269 పరుగులు సాధించి 6 వికెట్లు కోల్పోయింది. జట్టులోని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్రరెడ్డి 70, గురు రాఘవేంద్ర 48, యోగానంద 26, అర్జున్‌ టెండూల్కర్‌ 29, దత్తారెడ్డి 25 పరుగులు సాధించారు. హరినాథ్‌ 52, కామిల్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో అనంతపురం జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు సాధిస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement