తండ్రి వస్తేనే తనయుడి విడుదల! | altimetam to paster kannaiah by maoists | Sakshi
Sakshi News home page

తండ్రి వస్తేనే తనయుడి విడుదల!

Nov 10 2015 9:28 AM | Updated on Oct 9 2018 2:47 PM

తండ్రి వస్తేనే తనయుడి విడుదల! - Sakshi

తండ్రి వస్తేనే తనయుడి విడుదల!

తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతడి తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం.

చింతూరు: తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతడి తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టులకు దొరికిన పాస్టర్లను ఆదివారం రాత్రి విడిచి పెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్‌ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు? ఇస్సాక్‌ను చూపించారా? ఎలాంటి హెచ్చరికలు చేశారు? లాంటి ప్రశ్నలపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

అయితే ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్‌ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్టు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి కొడుకును విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్‌విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇస్సాక్‌ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement