'స్టేలతో కాలం గడుపుతున్న చంద్రబాబు' | alla ramakrishna reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'స్టేలతో కాలం గడుపుతున్న చంద్రబాబు'

Sep 23 2016 12:58 PM | Updated on May 29 2018 2:33 PM

'స్టేలతో కాలం గడుపుతున్న చంద్రబాబు' - Sakshi

'స్టేలతో కాలం గడుపుతున్న చంద్రబాబు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిప్పులు చెరిగారు.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్కే శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆయన స్టేలతో కాలం గడుపుతున్నారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో ఆయన స్టే తెచ్చున్నారని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులోనూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే... 4 వారాల్లో తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని చంద్రబాబును ఆర్కే సూటిగా ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్హాండెడ్గా దొరికిపోయారన్నారు. బ్లాక్మనీతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ ముమ్మాటికీ చంద్రబాబుదే అని ఆర్కే స్పష్టం చేశారు. అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement