'బార్లోనే కల్తీ జరిగింది' | alcohol Adulterated at swarna bar only | Sakshi
Sakshi News home page

'బార్లోనే కల్తీ జరిగింది'

Dec 10 2015 1:04 PM | Updated on Sep 3 2017 1:47 PM

బెజవాడ కల్తీ మద్యం ఘటనలో విచారణ నివేదిక సిద్ధమైంది.

విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనలో విచారణ నివేదిక సిద్ధమైంది. స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లు అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ నివేదికను ఎక్సైజ్ కమిషనర్ మీనా స్వయంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నారు.

 

బార్లోనే మోతాదుకు మించి మిథైనల్ కలిపినట్లు ఎక్సైజ్  అధికారులు చెప్పుతున్నారు. దీనిని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇద్దరి అధికారుల సస్పెన్షన్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి  తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ మద్యం సేవించి అయిదుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement