విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి చదువుకుంటే ఉన్నతస్థాయికి చేరుకుంటారని వరంగల్ నిట్ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ ఎన్‌ఐఎన్‌ఎన్ శర్మ అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యూకేషన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సేనేట్ హాల్‌లో ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
l ఉద్యోగాలు కల్పించే దిశలో ఆలోచించాలి
-
l నిట్ డీన్ ప్రొఫెసర్ శర్మ
కేయూక్యాంపస్ : విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి చదువుకుంటే ఉన్నతస్థాయికి చేరుకుంటారని వరంగల్ నిట్ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ ఎన్‌ఐఎన్‌ఎన్ శర్మ అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యూకేషన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సేనేట్ హాల్‌లో ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని శర్మ మాట్లాడారు. విద్యార్థులు ఇంజనీరింగ్‌లో సృజనాత్మకతతో స్వతంత్రంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా చదువుకోవాల న్నారు. విద్యార్థులు కంపెనీ స్థాపించి పలువురికి ఉద్యోగులు కల్పించేస్థాయికి ఎదగాలని, అందుకు ఇప్పటినుంచే కృషిచేయాలన్నారు. కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ మా ట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కి ల్స్ పెంపొందించుకోవాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ లేదన్నారు. కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా పెంపొందించుకోవాలన్నారు. క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. కొందరు విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాలుపొందారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఆర్.మేఘనరావు, వి.మహేందర్, పి.సంతోష్‌కుమార్, ప్రసన్నరాణి, లక్ష్మి, స్వప్న, రమ్య, శ్రీధర్, సూపరింటెం డెంట్ పి.అశోక్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.