ప్రశాంతంగా అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ పరీక్ష | agri engineering exam complete | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ పరీక్ష

Jun 28 2017 10:52 PM | Updated on Jun 4 2019 5:02 PM

ప్రశాంతంగా అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ పరీక్ష - Sakshi

ప్రశాంతంగా అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ పరీక్ష

పట్టణంలోని వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌–2017 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

మడకశిర : పట్టణంలోని వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌–2017 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షలకు డిప్లొమో విద్యార్థులకు  95.5శాతం  హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 170 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 161 మంది విద్యార్థులు  హాజరయ్యారు. 94మంది బాలురు, 67మంది బాలికలు పరీక్ష రాసినట్లు అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సీ రమణ తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం గుంటూరు నుంచి పాలిటెక్నిక్‌ కోఆర్డినేటర్‌  పీ సునీల్‌కుమార్‌  పరీక్షలను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement