మన్యంపై చలి పంజా మొదలైంది.రెండు రోజుల క్రితం వరకు రాజవొమ్మంగి మండలంలో పగటిపూట గరిష్టంగా 27 డిగ్రీలు, రాత్రిపూట కనిష్టంగా 19 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే ఉష్ణోగ్రత సోమవారం రాత్రి ఒక్కసారిగా 13 డిగ్రీలకు పడిపోయింది. దీంతో గిరిజనులు గజగజలాడారు. మరోవైపు వరి, చెరకు, పత్తి పంటలపై ఇటీవల అడవి జంతువుల దాడులు పెరిగిపోవడంతో ఎంత చలైనా
మన్యంలో పెరిగిన చలి
Nov 9 2016 12:17 AM | Updated on Apr 3 2019 9:27 PM
రాజవొమ్మంగి :
మన్యంపై చలి పంజా మొదలైంది.రెండు రోజుల క్రితం వరకు రాజవొమ్మంగి మండలంలో పగటిపూట గరిష్టంగా 27 డిగ్రీలు, రాత్రిపూట కనిష్టంగా 19 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే ఉష్ణోగ్రత సోమవారం రాత్రి ఒక్కసారిగా 13 డిగ్రీలకు పడిపోయింది. దీంతో గిరిజనులు గజగజలాడారు. మరోవైపు వరి, చెరకు, పత్తి పంటలపై ఇటీవల అడవి జంతువుల దాడులు పెరిగిపోవడంతో ఎంత చలైనా రైతులకు రాత్రిపూట పొలం కాపలా తప్పడం లేదు. పొలాల్లో చలిమంటలు వేసుకొని రాత్రంతా అడవి జంతువులు తమ పంటలను పాడు చేయకుండా రైతులు కాపలా కాస్తున్నారు. చలికితోడు సన్నపాటి వర్షాన్ని తలపించేలా మంచు కురుస్తుండడంతో రాత్రిపూట బయట తిరగడానికే జనం భయపడుతున్నారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులకు వ్యాధలు వచ్చే ముప్పు ఉందని పిల్లలు, వృద్ధులు భయపడుతున్నారు. కాగా చలి వాతావరణం, మరోవైపు పొగ మంచుతో మన్యం కొత్త అందాలను సంతరించుకుంటోంది. ప్రకృతి రమణీయత మదిని పులకింపజేస్తోంది.
Advertisement
Advertisement