అక్రమ ‘హద్దురాళ్ల’ తొలగింపు | actions on illegal lay-out | Sakshi
Sakshi News home page

అక్రమ ‘హద్దురాళ్ల’ తొలగింపు

Aug 27 2016 7:45 PM | Updated on Sep 4 2017 11:10 AM

ప్రజ్ఞాపూర్‌లోని ఓ వెంచర్‌లో హద్దురాళ్ల తొలగింపు

ప్రజ్ఞాపూర్‌లోని ఓ వెంచర్‌లో హద్దురాళ్ల తొలగింపు

గజ్వేల్‌లో కొనసాగుతున్న అక్రమ వెంచర్ల దందాపై ఈ నెల 26న ‘వెంచర్‌ వేసేయ్‌’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో అధికారులు వెంచర్లపై కొరఢా ఝులిపిస్తున్నారు.

గజ్వేల్‌: గజ్వేల్‌ పట్టణంలో కొనసాగుతున్న అక్రమ వెంచర్ల దందాపై ఈ నెల 26న  ‘వెంచర్‌ వేసేయ్‌’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో నగర పంచాయతీ అధికారులు అనుమతుల్లేని వెంచర్లపై కొరఢా ఝులిపిస్తున్నారు. శనివారం నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో గల 542 సర్వే నెంబరులోని రెండున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లో హద్దు రాళ్లను తొలగించారు. టీపీవో నర్సింహరాజు ఆధ్వర్యంలో ఈ తొలగింపు ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌ పావని, చైన్‌మెన్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement