నరహరిపై చర్యలు తీసుకోవాలి
అమరావతి, సాక్షి : అక్రమాలకు పాల్పడిన మార్కెటింగ్ శాఖ అధికారి నరహరిపైlవెంటనే చర్యలు తీసుకోవాలని గుంటూరు చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కిలారి రోశయ్య మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావుకు విజ్ఞప్తి చేశారు.
అమరావతి, సాక్షి : అక్రమాలకు పాల్పడిన మార్కెటింగ్ శాఖ అధికారి నరహరిపైlవెంటనే చర్యలు తీసుకోవాలని గుంటూరు చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కిలారి రోశయ్య మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావుకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో కమిషన్ ఏజెంట్లు దుర్గారావు, నిమ్మగడ్డ శ్రీనివాసరావుతోపాటు పలువురు వ్యాపారులు గురువారం కమిషనర్‌ను కలిశారు. నరహరి అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులున్నాయని, లైసెన్సుల వ్యవహారంలో అతను బేరసారాలు జరిపినట్లు ఆడియోటేపుల్లో స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. 2013 నుంచి లైసెన్సులు రెన్యూవల్ చేయకుండా ప్రభుత్వం సైతం తమను ఇబ్బంది పెడుతుందన్నారు. ఆడియో టేపులపై సమగ్ర దర్యాప్తు జరిపి, నరహరిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం తక్షణమే వ్యాపారుల లైసెన్సులు రెన్యూవల్ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లైసెన్సుల రెన్యూవల్‌లో నరహరి అవినీతిపై గతంలోనే కిలారి రోశయ్య లోకాయుక్తకు సైతం ఫిర్యాదు చేశారు.