మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

abbas dargah ursu fest in nalgonda district - Sakshi

నేటి నుంచి 23 వరకు ఉర్సు

వివిధ జిల్లాల నుంచి రానున్న భక్తులు

ఉర్సు, కల్యాణం ఒకేసారి జరగడం ఇక్కడి ప్రత్యేకత

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో జాన్‌పహాడ్‌గా పేరుగాంచిన అజహరత్‌ అబ్బాస్‌ దర్గా ఉత్సవాలకు ముస్తాబవుతోంది.. చింతపల్లి మండలం పీకేమల్లేపల్లిలో కొలువైన ఈ దర్గా 49వ ఉర్సు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, మెదక్‌ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శిస్తే శరీరంలోని రుగ్మతులు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.

నల్లగొండ, చింతపల్లి : ఓ వైపు ఉర్సు మరో వైపు భక్త మహేశ్వరుడి కల్యా ణం.. అజహరత్‌ అబ్బాస్‌ కింది భాగంలో ఉండగా గుట్ట పైభాగంలో శ్రీగిరి భక్త మహేశ్వరస్వామి ఆలయం ఉం టుంది. ప్రస్తుతం ఇక్కడ ఓ వైపు మహేశ్వరస్వామి ఉత్సవాలు, మరో వైపు దర్గాలో ఉర్సు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఇకపోతే హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఈ దర్గా నిలిచిందని చెప్పవచ్చు. గుట్టపై శ్రీ వినాయక స్వా మి, మహేశ్వరస్వామి, ఉమామహేశ్వర దేవి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు నవ విగ్రహాలనూ ప్రతిష్టిం చారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యుత్‌ దీపాలతో అ లంకరించిన 75 అడుగుల ఎత్తు గల మక్క మదీన శివలిం గం నమూనాల అలం కరణలు అమితంగా ఆకర్షిస్తాయి.

వెళ్లే మార్గం..
చింతపల్లి మం డలం మాల్, కుర్మేడు, కుర్రం పల్లి, సాయిరెడ్డి, మొద్గులమల్లేపల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది.  ఉర్సు సందర్భంగా అన్ని రూట్లలో బస్సుల ను ఏర్పాటు చేశారు. 3 రోజులు అన్నదానం ఉంటుంది.

హాజరుకాన్ను మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు..
అజహరత్‌ అబ్బాస్‌ దర్గా ఉత్సవాల్లో 50ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఐఏఎస్‌లు తప్పనిసరిగా హాజరుకావడం ఆనవాయితీ. ఉత్సవాలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న,  ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్, ఎమ్మెల్యేలు రమావత్‌ రవీంద్రకుమార్, చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీఎల్పీ నేత జానారెడ్డి, ఐఏఎస్‌ లు లక్ష్మీపార్ధసారధి, గౌరవ్‌ ఉప్పల్‌తో పాటు పలువురు అధికారులు ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు.

ఉర్సు షెడ్యూల్‌..
21 రాత్రి 11 గంటల నుంచి మహమ్మద్‌ లతీఫ్‌ సాహెబ్‌ చే ఒంటెపై గంధం ఊరేగింపు, ఉదయం 8 గంటలకు శ్రీగిరి భక్త మహేశ్వరస్వామి కళ్యాణోత్సవం, 23న భక్తుల దీపారాధన, కందూళ్లు నిర్వహిస్తారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top