గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య | a conistable committed suicide in chittor district | Sakshi
Sakshi News home page

గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Sep 4 2015 6:51 AM | Updated on Aug 21 2018 3:16 PM

గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - Sakshi

గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏపీఎస్పీకి చెందిన 9వ బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏపీఎస్పీకి చెందిన 9వ బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం రేణిగుంటలో చోటుచేసుకుంది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా సంతోష్ పనిచేస్తున్నాడు. అయితే, ఈరోజు ఉదయం అతడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే కుప్పకూలిపోయి సంతోష్ మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు శ్రీకాకుళం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement