సీఎం ఇంటి దారిలో 75 విద్యుత్‌ స్తంభాలు | 75 current poles arranged near CM's house | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటి దారిలో 75 విద్యుత్‌ స్తంభాలు

Jan 1 2017 9:22 PM | Updated on Sep 5 2017 12:08 AM

సీఎం ఇంటి దారిలో 75 విద్యుత్‌ స్తంభాలు

సీఎం ఇంటి దారిలో 75 విద్యుత్‌ స్తంభాలు

ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లే దారిలో కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఉండవల్లి (తాడేపల్లి రూరల్‌):   ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి   చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లే దారిలో కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు   అధికారులు సిద్ధమయ్యారు.  సీతానగరం బకింగ్‌ హామ్‌ హెడ్‌ స్లూయిజ్‌ నుంచి సీఎం ఇంటి వరకు కరకట్టకు ఆనుకుని దిగువ ప్రాంతంలో 75 స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ఆదివారం కాంక్రీట్‌ పనులను చేపట్టారు.  మొత్తం 1.5 కిలోమీటర్ల పొడవున ఈ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. స్తంభానికి స్తంభానికి మధ్య 30 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇప్పటికే బకింగ్‌ హామ్‌ హెడ్‌ స్లూయిజ్‌ నుంచి సీఎం నివాసం వరకు 175 విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఉండవల్లి పంచాయతీకి రూ. 40 వేల కరెంటు బిల్లు వస్తోంది. మరలా ఈ 75 లైట్లను కూడా ఏర్పాటు చేస్తే విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందోనని అధికారులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement