సత్తాచాటిన బాక్సర్లు
రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచారని ఏపీ స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.
	అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచారని ఏపీ స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలలో సత్తాచాటారన్నారు. ఓ స్వర్ణ పతకంతో పాటు ఏడు కాంస్య పతకాలను సాధించారని చెప్పారు.  పతకాలు సాధించిన క్రీడాకారులకు డిప్యూటీ డీవీఈఓ సుభాకర్, పీడీలు పోతులయ్య, రామకష్ణ, కోచ్‌లు శ్రీనాథ్, పెద్దక్క, క్రీడాకారులను అభినందించారు.  బంగారు పతకం సాధించిన సోమిన్ మహమ్మద్ ఢిల్లీలో జరిగే నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు.
	
	పతకాలు సాధించిన క్రీడాకారులు
	బాలుర విభాగం
	సోమిన్ మహమ్మద్ – బంగారు పతకం
	రజతం
	ఇబ్రహీమ్, బాబా యూనిస్, శ్రీధర్‌బాబు, అంజనీ నందనరెడ్డి
	బాలికల విభాగం
	రజతం
	సంఘవి, తులసీ, పల్లవి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
