తూమకుంటలో 30 గొర్రెలు అపహరణ | 30 sheeps theft in thumakunta | Sakshi
Sakshi News home page

తూమకుంటలో 30 గొర్రెలు అపహరణ

Jul 17 2016 9:53 PM | Updated on Sep 4 2017 5:07 AM

మండలంలోని తూమకుంట గ్రామ శివార్లలో నివాసం ఉంటున్న గంగప్పకు చెందిన గొర్రెలను అపహరించుకొని వెళ్లినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు.

హిందూపురం రూరల్‌ : మండలంలోని తూమకుంట గ్రామ శివార్లలో నివాసం ఉంటున్న గంగప్పకు చెందిన గొర్రెలను అపహరించుకొని వెళ్లినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెల రొప్పానికి ఉన్న తలుపును పగులకొట్టి అందులో ఉన్న 25 గొర్రెలు, ఐదు మేకలను ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. సుమారు రూ.1.5 లక్షలు న ష్టం జరిగినట్లు ఆవేదన చెందాడు. పోలీసులు ఆచూకీ కనుగొని తనకు న్యాయం చేయాలని కోరాడు. 

Advertisement
 
Advertisement
Advertisement