పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 30 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్: కరీంనగర్ నగర శివారులోని కొత‍్తయాస‍్వాడలో మంగళవారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర‍్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ‍్వర‍్యంలో 200 పోలీసులు ఇంటింటా సోదాలు నిర‍్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో చోరీలకు పాల‍్పడిన ఓ యువకుడికి ఈ సందర్భంగా కౌన‍్సిలింగ్ ఇచ్చారు.