3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం | 3 thousand acers of cultivated pulses target | Sakshi
Sakshi News home page

3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం

Mar 24 2017 7:18 PM | Updated on Sep 5 2017 6:59 AM

3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం

3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం

జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్‌) : జిల్లాలో రబీ పూర్తయ్యాక మూడు వేల ఎకరాల్లో అపరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు.

 జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్‌) : జిల్లాలో రబీ పూర్తయ్యాక మూడు వేల ఎకరాల్లో అపరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వేసవిలో అపరాలు సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ ఈ వేసవిలో మినుము, పిల్లిపెసర, జీలుగు, పెసలు సాగు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా రైతుకు కొంత ఆదాయం సమకూరుతుందన్నారు. ఆయా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జగన్నాథపురం బాడవాకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు కాలేదన్నారు. అనంతరం పలువురు రైతులు రుణమాఫీ విషయాన్ని జేడీ దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్‌ ముత్యాల వీవీ సత్యనారాయణ, నవాబ్‌పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, తాడేపల్లిగూడెం ఏడీఏ ఎన్‌.శ్రీనివాస్, మండల వ్యవసాయా«ధికారి కె.వేణుగోపాల్ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement