breaking news
jagannadapuram
-
ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్): మండలంలోని జగన్నాథపురం హజరత్ కాలే మస్తాన్ షాఔలియా దర్గాలో మంగళవారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి దర్గాలో ప్రత్యేక నమాజ్‌లు, భక్తి పాటలు ఆలపించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు, దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి, ఆమె కుమారుడు అబ్బిన రాజీవ్ చౌదరి నవాబ్‌పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, నీటి సంఘం అధ్యక్షుడు బొల్లిన రామకృష్ణ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుల మతాలకతీతంగా ప్రజలు దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం చందల్ ఊరేగింపు జరుగుతుందని దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి తెలిపారు. -
3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్) : జిల్లాలో రబీ పూర్తయ్యాక మూడు వేల ఎకరాల్లో అపరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వేసవిలో అపరాలు సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ ఈ వేసవిలో మినుము, పిల్లిపెసర, జీలుగు, పెసలు సాగు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా రైతుకు కొంత ఆదాయం సమకూరుతుందన్నారు. ఆయా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జగన్నాథపురం బాడవాకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదన్నారు. అనంతరం పలువురు రైతులు రుణమాఫీ విషయాన్ని జేడీ దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్ ముత్యాల వీవీ సత్యనారాయణ, నవాబ్‌పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, తాడేపల్లిగూడెం ఏడీఏ ఎన్.శ్రీనివాస్, మండల వ్యవసాయా«ధికారి కె.వేణుగోపాల్ పాల్గొన్నారు.