పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో తండ్రీకూతురు మరణించారు.
పెద్దపల్లి రూరల్: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో తండ్రీకూతురు మరణించారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో రెండవ ప్లాట్ ఫాంకు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టిన ఘటనలో తండ్రి యేసురత్నం (32), కూతురు జాయినదస్త (6) అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన యేసురత్నం కుటుంబం రెండేళ్ల కాలంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు వలసవచ్చింది. సుల్తానాబాద్‌లో ఉంటు తాపీమేస్త్రీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం తమ సొంత గ్రామానికి వెళ్లేందుకు యేసురత్నం తన భార్య మంజుల, కూతుళ్లు జాయినదస్త, రుతుతో పెద్దపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రామగిరి ప్యాసింజర్ రైలు ఎక్కాలన్న ఆదుర్దాతో తన చిన్న కూతురు జాయినదస్తను ఎత్తుకుని పట్టాలపై నుంచి రెండవ ప్లాట్‌ఫాంకు వెళుతుండా అదే లైన్‌లో అతి వేగంగా వచ్చిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో తండ్రి, కూతురు ఘటనస్థలంలోనే మరణించారు.