28 నుంచి ఆదిభట్ల జయంత్యుత్సవాలు | 28th onwords adibhatla jaynthyostavam | Sakshi
Sakshi News home page

28 నుంచి ఆదిభట్ల జయంత్యుత్సవాలు

Aug 25 2016 10:00 PM | Updated on Sep 4 2017 10:52 AM

హరికథ పతామహుడు ఆదిభట్ల నారాయణదాసు 153వ జయంత్యుత్సవాలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు సత్యనారాయణపురంలోని కాశీ విశేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్నట్లు ఆదిభట్ల శిష్యప్రశిష్య సంఘం కన్వీనర్‌ బుర్రా పద్మనాభ శర్మ తెలిపారు.

విజయవాడ కల్చరల్‌ :
హరికథ పతామహుడు ఆదిభట్ల నారాయణదాసు 153వ జయంత్యుత్సవాలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు సత్యనారాయణపురంలోని కాశీ విశేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్నట్లు ఆదిభట్ల శిష్యప్రశిష్య సంఘం కన్వీనర్‌ బుర్రా పద్మనాభ శర్మ తెలిపారు. సత్యనారాయణపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 9 గంటలకు నారాయణ దాసు విగ్రహానికి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మూడు రోజులపాటు హరికథా గానం ఉంటుందని తెలిపారు. 29న నేతి లక్ష్మీనారాయణ భాగవతుల జయంతి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదే సభలో ధర్మారావు భాగవతార్‌ను నేతి లక్ష్మీనారాయణ స్మారక పురస్కారంతో సత్కరిస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement