పిచ్చికుక్క దాడిలో 23మందికి గాయాలు | 23 members injured in dog attack | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడిలో 23మందికి గాయాలు

Apr 5 2016 6:04 PM | Updated on Sep 3 2017 9:16 PM

మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామంలో మంగళవారం పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులు సహా 23 మంది గాయాల పాలయ్యారు.

జిన్నారం (మెదక్) : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామంలో మంగళవారం పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులు సహా 23 మంది గాయాల పాలయ్యారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద సంచరించే ఓ కుక్కకు పిచ్చి పట్టింది. దీంతో అది ఉదయం నుంచి కనబడినవారిని వదలకుండా కరిచేసింది. ఇళ్ల వద్ద ఆడుకునే చిన్నారులు, పరిశ్రమల్లో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే కార్మికులను కరిచిపెట్టింది. దాని ధాటికి 23మంది గాయపడ్డారు. వీరిలో 10మంది చిన్నపిల్లలున్నారు. వారందరినీ జిన్నారంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులంతా కలసి పిచ్చికుక్కను తరిమికొట్టి చంపేశారు.

Advertisement
 
Advertisement
Advertisement