ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి భూములకు నీళ్లు ఇచ్చేందుకు 220 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చర్యలు చేపట్టారు.
ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటి విడుదలకు 220కేవీ లైన్
Sep 24 2016 1:57 AM | Updated on Sep 4 2017 2:40 PM
–17 కిలో మీటర్ల లైన్‌కు ప్రత్యేక బృందాలు
కర్నూలు(అగ్రికల్చర్): ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి భూములకు నీళ్లు ఇచ్చేందుకు 220 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చర్యలు చేపట్టారు. నన్నూరు, పూడిచెర్ల, కేతవరం, గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు వరకు 17 కిలో మీటర్ల మేర హైటెన్షన్ లైన్ వేయాల్సి ఉంది. పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో పోల్‌కు 49 చదరపు గజాల స్థలం అవసరమవుతుంది. రైతులను ఒప్పించి భుములను తీసుకునేందుకు కలెక్టర్ తహశీల్దారు, మండల వ్యవసాయాధికారితో బృందాలను ఏర్పాటు చేశారు. పోల్‌కు అవసరమైన 49 చదరపు గజాల స్థలానికి పరిహారం కూడా ఇస్తారు. విద్యుత్ లైన్ వేసిన తర్వాత ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు.
Advertisement


