సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు | 2 injured in a road accident | Sakshi
Sakshi News home page

సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు

Sep 6 2015 2:26 PM | Updated on Sep 3 2017 8:52 AM

సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు

మదనపల్లె(చిత్తూరు): సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం జరిగింది.

వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెం మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లెకు వచ్చి వెళ్తున్న సమయంలో.. స్థానిక అమ్మచెరువు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement