
ప్రయాణికులతో వెళ్తున్న జీపును సిమెంట్ లారీ ఒక్కసారిగా వచ్చి ఢీకొనడంతో ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు.
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో?
చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం