మహిళా కానిస్టేబుళ్లకు తప్పని ఈవ్ టీజింగ్! | 2 arrested in eve teased in female conistables in krishna district | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుళ్లకు తప్పని ఈవ్ టీజింగ్!

Nov 18 2015 8:34 AM | Updated on Sep 3 2017 12:40 PM

మహిళా కానిస్టేబుళ్లకు తప్పని ఈవ్ టీజింగ్!

మహిళా కానిస్టేబుళ్లకు తప్పని ఈవ్ టీజింగ్!

సామాన్య ప్రజలకు, ఆడవాళ్లకు రక్షణ కల్పించే మహిళా కానిస్టేబుళ్లను సైతం కొందరు పోకిరీలు ఈవ్ టీజింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.

విజయవాడ: సామాన్య ప్రజలకు, ఆడవాళ్లకు రక్షణ కల్పించే మహిళా కానిస్టేబుళ్లను సైతం కొందరు పోకిరీలు ఈవ్ టీజింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు విధులు నిర్వహించడానికి బైక్పై బయలుదేరారు. అయితే, ఇద్దరు ఆకతాయిలు తమ ఆగడాలను ప్రదర్శించాలని చూశారు. బైక్పై వెళ్తున్న మహిళా కానిస్టేబుళ్లను నానా మాటలు అంటూ వారిని టీజ్ చేయడం మొదలుపెట్టారు.

వీరు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన మరికొంతమంది పోలీసులు ఇద్దరు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రంగారెడ్డి, సునీల్ కుమార్లుగా గుర్తించారు. నిందితులపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళా ఉద్యోగులపై దాడులు, వేధింపులు జరుగుతున్నప్పటికీ వారి విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండటంతో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement