పాలేరు ఉప ఎన్నికకు మొత్తంగా 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
పాలేరు ఉప ఎన్నికకు మొత్తంగా 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం చివరిరోజు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ముగిసేటప్పటికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎంలతోపాటు శ్రమశక్తి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూట్నీ ఈనెల 30న, ఉపసంహరణ మే 2న జరగనుంది.