ఆయిల్ ట్యాంకర్లో 1500 కిలోల గంజాయి! | 1500 kg cannabis capture in visakhapatnam district | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్లో 1500 కిలోల గంజాయి!

Feb 21 2017 10:16 AM | Updated on May 3 2018 3:20 PM

ఆయిల్ ట్యాంకర్లో 1500 కిలోల గంజాయి! - Sakshi

ఆయిల్ ట్యాంకర్లో 1500 కిలోల గంజాయి!

విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పాడేరు మండలం చింతలవీధి వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయిల్‌ ట్యాంకర్‌లో అక్రమంగా రవాణాచేస్తున్న 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు సమాచారం మేరకు పోలీసులు కాపుకాసి ట్యాంకర్‌ను తనిఖీచేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement