వడదెబ్బతో 14 మంది మృతి | 14 people dead in sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 14 మంది మృతి

May 2 2016 1:26 AM | Updated on Sep 3 2017 11:12 PM

భానుడి ప్రతానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం జిల్లాలో వడదెబ్బతో 14 మంది మృత్యువాత పడ్డారు.

తుమ్మడం (నిడమనూరు) : భానుడి ప్రతానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం జిల్లాలో వడదెబ్బతో  14  మంది మృత్యువాత పడ్డారు. నిడమనూరు మండలం తుమ్మడంలో పోతుగంటి మైసయ్య (58)  వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వడదెబ్బ తగులగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రో జు అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
 
 యాదగిరి గుట్టలో ఓ మహిళ
 యాదగిరిగుట్ట : మండలంలోని వంగపల్లికి చెందిన కె.లక్ష్మి (59) వడదెబ్బతో వృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తన బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన లక్ష్మి తీవ్రంగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైందని చెప్పారు. సాయంత్రం నిద్రలోకి జారుకున్న ఆమె ఆదివారం వేకువజామున నిద్రలోనే వృతి చెందినట్లు తెలిపారు.
 
 త్రిపురారంలో వృద్ధుడు...
 త్రిపురారం : మండలంలోని బాబుసాయిపేట గ్రామంలో ఆదివారం వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సకినాల జానయ్య (75) ఎండి వేడిమికి మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
 
 నాంపల్లిలో వృద్ధుడు...
 నాంపల్లి : మండల కేంద్రంలోని పూల రాములమ్మ (60) వడదెబ్బతో ఆదివారం మృతి చెందింది. రాములమ్మ ఎండ తీవ్రతతో వారం రోజుల క్రితం అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
 మోత్కూరులో వృద్ధురాలు...
 మోత్కూరు : మండల కేంద్రంలోని అన్నెపువాడ కాలనీకి చెందిన అన్నెపు బక్కమ్మ ( 55) అనే వృద్ధురాలు వడదెబ్బతో ఆదివారం సాయంత్రం మృతిచెంది. రెండు రోజుల క్రితం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కాలనీవాసులు తెలిపారు. మృతురాలికి కుమార్తె ఉన్నారు.
 
 వెల్లటూరులో మహిళ...
 వెల్లటూరు (మేళ్లచెర్వు) :  మండలంలోని వెల్లటూరు పునరావాసకేంద్రంలో వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేతపల్లి యలమందమ్మ (58) అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తుండగా రెండు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. ఆమెకు ఇంటి వద్ద చికిత్స అందిస్తుండగా శనివారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
 
 నూతనకల్‌లో వృద్ధుడు...
 నూతనకల్ : మండల పరిధిలోని పెద్ద నెమిల గ్రామంలో వడదెబ్బకు గురై పయ్యావుల వెంకటయ్య (70) ఆదివారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  వారం రోజుల నుంచి వీస్తున్న వడగాల్పులు, ఎండవేడిమితో వెంకటయ్య అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడాని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 
 అలేరులో వృద్ధుడు...
 ఆలేరు : మండలంలోని మధిర గ్రామం సాయిగూడెంకు చెందిన చింతకింది భూమయ్య (75) వడదెబ్బతో ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న భూమయ్య రెండు రోజులుగా పెన్షన్ కోసం ఆలేరులోని పోస్టాఫీస్ కార్యాలయం వద్దకు వెళ్లొస్తున్నాడని, ఈ క్రమం లో ఎండకు తాళలేక అస్వస్థతకు గురై ఆదివారం మృతి చెందాడని తెలిపారు.
 
 వెల్మగూడెంలో వృద్ధురాలు...
 వెల్మగూడెం (పెద్దవూర) : వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని వెల్మగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పగడాల లక్ష్మమ్మ (76) శనివారం పశువులను మేపటానికి పొలానికి వెళ్లింది. తీవ్రమైన ఎండలతో అస్వస్థతకు గురైంది. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మమ్మ వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో స్థానిక వైద్యుని వద్ద చికిత్స చేయించారు.  ఆదివా రం పరిస్థితి విషమించి మృతి చెందింది.
 
 శాలిగౌరారంలో ఒకరు...
 శాలిగౌరారం : వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎన్.జీ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎన్.జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సిరుపంగి లింగయ్య (60) వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా నకిరేకల్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇంట్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  
 
 రాజాపేటలో వృద్ధుడు...
 రాజాపేట : మండలంలోని సోమారం గ్రామంలో ఆదివారం వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన పర్స నర్సయ్య (70) ఆదివారం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలో జరిగే పశువుల సంతకు వెళ్లాడు. కాగా, తిరిగివచ్చిన నర్సయ్య తీవ్ర ఆస్వస్థతకు గురై రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
 
 మిర్యాలగూడ మేస్త్రీ...
 మిర్యాలగూడ అర్బన్ : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలోని బంగారుగడ్డలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వద్దెనిపల్లి సుబ్బారావు (68) సుతారి మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని స్థానిక కౌన్సిలర్ ఆలగడప గిరిధర్ పరామర్శించారు.
 
 సిలార్‌మియాగూడెంలో లారీ డ్రైవర్...
 తిప్పర్తి : మండలంలోని సిలార్‌మియాగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వడదెబ్బతో శనివారం రాత్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బుర్రి సైదులు (37) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం గరిడేపల్లి మండలం వెంకటాపురం గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. ఈ క్రమంలో వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement