12 మందిపై బైండోవర్‌ | 12 people baindovar | Sakshi
Sakshi News home page

12 మందిపై బైండోవర్‌

Jul 21 2016 5:58 PM | Updated on Mar 28 2018 11:26 AM

పాత నేరస్తులు 12 మందిని గురువారం తహశీల్దార్‌ మారుతీ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ హన్మానాయక్‌ తెలిపారు. జిన్నారం, తొర్మామిడి గ్రామాలకు చెందిన వీరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు.

బంట్వారం: పాత నేరస్తులు 12 మందిని గురువారం తహశీల్దార్‌ మారుతీ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ హన్మానాయక్‌ తెలిపారు. జిన్నారం, తొర్మామిడి గ్రామాలకు చెందిన వీరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం, బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడటంవంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీరందరిని హెచ్చరించి వదిలేశామని చెప్పారు. మండల పరిధిలోని పాత నేరస్తులందరిపై నిఘా పెట్టినట్లు ఎస్‌ఐ హన్మానాయక్‌ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement