అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం | 11 thatched houses mishap in fire accident | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం

Dec 13 2015 7:42 AM | Updated on Sep 18 2018 8:38 PM

విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం రోలుచొప్పడిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.

విజయనగరం: విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం రోలుచొప్పడిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement