గల్ఫ్ వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వరా.? | no ration cards for gulf returnees | Sakshi
Sakshi News home page

గల్ఫ్ వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వరా.?

Sep 4 2017 8:20 PM | Updated on Aug 21 2018 3:10 PM

గల్ఫ్ వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వరా.? - Sakshi

గల్ఫ్ వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వరా.?

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది గల్ఫ్ వలసకార్మికులు రేషన్ కార్డుల సమస్యను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది గల్ఫ్ వలసకార్మికులు రేషన్ కార్డుల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ద్యావన్ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గల్ఫ్ వలసజీవుల గాథ వినండి. 
 
బొల్లం నర్సయ్య: ఇతనికి  15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు (20.11.2006) ఇతని తండ్రి బొల్లం మల్లయ్య రేషన్ కార్డులో  పేరు నమోదు అయ్యింది. దాని ఆధారంగానే 2010 లో పాస్ పోర్ట్ పొంది 2011 సౌదీ అరేబియాకు వెళ్ళాడు. ఎడారిలో గొర్రెలకాపరిగా ఆరేండ్లు పనిచేసి మార్చి 2017 న మాతృభూమికి చేరుకున్నాడు. వచ్చిన తరువాత ఆధార్ కార్డు పొందాడు. రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. 
 
రెబ్బాస్ రాజన్న: 2015 లో బహరేన్ వెళ్లిన ఇతను మధ్యలో రెండు సార్లు స్వగ్రామానికి వచ్చివెళ్ళాడు. 2005 డిసెంబర్ లో తిరిగి వచ్చాడు. వచ్చిన తరువాత ఆధార్ కార్డు పొందాడు. రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు, కానీ ఫలితం లేదు. 
 
గల్ఫ్ వలస కార్మికులందరికీ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డుకు, రేషన్ కార్డుకు లింకు పెట్టి వేదిస్తున్నారని, ఆధార్ కార్డు తీసికెళ్తే వెబ్ సైటు పనిచేయడం లేదని తహసీల్దార్లు జవాబు ఇస్తున్నారని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement