వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | International Cricket Stadium in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

Jun 12 2016 9:27 AM | Updated on Sep 4 2017 2:15 AM

వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానం ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ క్రికెట్ అసోసియేష...

ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలం
టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    గురువారెడ్డి

భీమారం : వరంగల్‌లో అంతర్జాతీయస్థాయి క్రికెట్ మైదానం ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. నగర శివారులోని కిట్స్ కళాశాలలో శనివారం నుంచి టీసీఏ ఆధ్వర్యంలో జోనల్ స్థారుు క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యూరుు. ఈ సందర్భంగా పోటీలకు హాజరైన గురువారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేయాలని టీసీఏ ఆధ్వర్యంలో ఇటీవల సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. స్టేడియం ఏర్పాటుపై బీసీసీఐకి కూడా దరఖాస్తు చేసుకున్నామని, త్వరలోనే దీనిపై అనుమతి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు జోన్ల నుంచి 30 జట్లను ఎంపిక చేసి వారికి లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైనల్ ఆడిన నాలుగు జట్ల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి రంజీ ట్రోఫీలకు సిద్ధం చేస్తామని వివరించారు. జట్లకు మాజీ క్రీడాకారులు అబిద్‌అలీ, విశ్వనాథ్‌లు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.


తొలిసారిగా ఆన్‌లైన్ స్కోరింగ్..
కిట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జోనల్‌స్థారుు క్రికెట్ లీగ్ మ్యాచ్‌ల్లో తొలిసారిగా ఆన్‌లైన్ స్కోరింగ్ విధానం అమలు చేస్తున్నట్లు గురువారెడ్డి చెప్పారు. టీసీఏ. స్కోరింగ్ ఎస్‌టీఆర్. కం ద్వారా స్కోర్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఆయన వెంట కోచ్ ఇంద్రశేఖర్, టీసీఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జయపాల్, పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement