
అనంతపురం: జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత కేశవరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఆత్మకూరుకు చెందిన కేశవరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పథకం ప‍్రకారం కేశవరెడ్డిపై రాడ్‌లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. అయితే తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
మాజీ సర్పంచ్ అయిన కేశవరెడ్డిని పరిటాల కుటుంబమే హత్య చేయించిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే పరిటాల వర్గీయులు కేశవరెడ్డిని హత్య చేశారని మండిపడుతున్నారు. ఈ హత్య ఘటనలో మంత్రి సునీత సోదరడు ప్రమేయముందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేశవరెడ్డి భార్య రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.