ఉరేసుకుని ఇద్దరి యువకుల ఆత్మహత్య | Youth Suicide In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఇద్దరి యువకుల ఆత్మహత్య

Oct 28 2018 9:03 AM | Updated on Sep 18 2019 3:26 PM

Youth Suicide In Mahabubnagar - Sakshi

సిరాజొద్దీన్‌ మృతదేహం శ్రీనివాస్‌రెడ్డి (ఫైల్‌) 

నేరేడుచర్ల(హుజూర్‌నగర్‌) : మనస్తాపంతో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘట నలు శనివారం సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలకేంద్రంలోని మ హింద్రా షోరూం వెనుకాలో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్‌ షేక్‌. సిరాజోద్దీన్‌ (30)కు సంవత్సరంన్నర క్రితం దిర్శించర్ల గ్రామానికి చెందిన హాజి దాభేగంతో వివాహం జరిగింది. సిరోజోద్దీన్‌ భార్య వేరే కాపురం పెట్టాలని ఘర్షణ పడి తన పుట్టిల్లు దిర్శించర్లకు వెళ్లిపోయింది. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో సిరాజోద్దీన్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్ద మ్మ కుమారుడు రియాజుద్దీన్‌ గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి హజిదాభేగం రెండో భార్యకాగా 5 నెలల పాప కూడా ఉంది. మృతుడి తల్లి జహిన్నిస్సాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ సర్ధార్‌ నాయక్‌ తెలిపారు.
 
సింగారంలో..
ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : ఆత్మకూరు(ఎం) మండలం సింగారంలో శనివారం ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగారం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరెడ్డి(33) శనివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు పోయాడు. అక్కడ తల్లిదండ్రులతో గొడవ జరిగినట్లు తెలిసింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడంతో తట్టుకోలేక భార్య అపర్ణ ఇంటికి వచ్చి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి  పాల్పడింది. చికిత్స నిమిత్తం 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే వీరికి వివాహమైంది.

Advertisement
 
Advertisement
Advertisement