ప్రియుడి ఇంటి ముందు గొయ్యి తవ్విన బంధువులు

Young woman Commits Suicide In NIzamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఓ యువతి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా, నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. కోపంతో మృతురాలి బంధువుల ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. వివరాలివి.. గత కొద్దికాలంగా లక్కంపల్లి గ్రామానికి చెందిన లత, తవేరా గ్రామానికి చెందిన గంగాధర్‌ ప్రేమించుకున్నారు. పెద్దల ఒప్పుకోరని ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయింది.

బంధువలు వారిని వెతికి తిరిగి ఇంటికి తీసుకొచ్చి మందలించారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన లత నిన్న(సోమవారం) కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. లత చికిత్స పొందతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. దీంతో తన కూతురి మృతికి గంగాధర్‌ కారణమని బంధువులు ఆ యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అంతేకాక మృతదేహాన్ని పూడ్చిపెట్టెందుకు ఇంటి బయట గొయ్యి కూడా తవ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. గంగాధర్‌ పట్టుకుంటామని పోలీసులు చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తమ కూతురి మృతికి గంగాధర్‌ కారణమని యువతి తల్లి ఆరోపించింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువతి తల్లిదండ్రులు విలపించిన తీరు అందర్నీ కదలించింది. లత ప్రియుడు గంగాధర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top