స్నేహితుడి ఆత్మహత్యతో కలత చెంది.. | Young Man Suicide After Hes Friend Death | Sakshi
Sakshi News home page

స్నేహితుడి ఆత్మహత్యతో కలత చెంది..

Mar 31 2018 8:46 AM | Updated on Nov 6 2018 8:16 PM

Young Man Suicide After Hes Friend Death - Sakshi

సురేష్‌ (ఫైల్‌)

అంబర్‌పేట: స్నేహితుని ఆత్మహత్యతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ కథనం ప్రకారం గోల్నాక న్యూగంగానగర్‌కు చెందిన సురేష్‌కుమార్‌(26) క్యాటరింగ్‌ కార్మికుడిగా పని చేసేవాడు. కొద్దిరోజుల క్రితం మలక్‌పేటకు చెందిన అతని స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటినుంచి సురేష్‌కుమార్‌ మానసికంగా కలత చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స చేయించడంతో ఆరోగ్యం మెరుగుపడింది. ఈ నేపథ్యంలో పాతబస్తీకి చెందిన యువతితో నిశ్చితార్ధం జరిపించారు. గురువారం రాత్రి కుటుంబసభ్యులు శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో సురేష్‌కుమార్, అతని సోదరుడు కిరణ్‌ ఉన్నారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అన్న వద్ద రూ.50 తీసుకొని బయటకు వెళ్లి వచ్చిన సురేష్‌కుమార్‌ తన గదిలోకి వెళ్లి ప్లాస్టిక్‌ వైరుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement