నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ సూసైడ్‌! | Young Man Selfie Suicide In Krishna | Sakshi
Sakshi News home page

నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ సూసైడ్‌!

May 19 2019 5:24 PM | Updated on May 19 2019 5:33 PM

Young Man Selfie Suicide In Krishna - Sakshi

ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం సెల్ఫీ వీడియో...

సాక్షి, కృష్ణాజిల్లా : వడ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది వ్యక్తుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన భానుప్రకాష్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం సెల్ఫీ వీడియో తీశాడు.

తన చావుకు అఖిల్, అఖిల్ తండ్రి కారణమని వీడియోలో పేర్కొన్నాడు. వారివద్ద తీసుకున్న అప్పుకు తనను బెదిరించి వడ్డీ పెంచి, బైక్‌ లాక్కొన్నారని తెలిపాడు. తన తల్లి ఏటీఎంను సైతం లాక్కొని, ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు మీద అందరి ముందు తనను నిలదీయటం కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అంత్యక్రియల అనంతరం భానుప్రకాష్‌ మిత్రులు అతడి మొబైల్‌ ఫోన్‌ను చెక్‌ చేయగా సెల్ఫీ వీడియో వెలుగుచూసింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
వడ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement