యువకుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో పేర్లు | Young Man Commits Suicide in Kukatpally  | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పేరుతో మోసం.. యువకుడు ఆత్మహత్య

Mar 7 2018 4:28 PM | Updated on Nov 6 2018 7:53 PM

Young Man Commits Suicide in Kukatpally  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఓ అపార్టుమెంట్‌లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్‌ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. స్నేహితుల మాటల నమ్మి బ్యాక్‌ డోర్‌లో ఉద్యోగం కోసం మహేష్‌ లక్షల డబ్బు కట్టాడు. చాలా రోజులైనా స్నేహితులు ఉద్యోగం చూపించలేదు. అంతేకాక ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. 

దీంతో రూమ్‌లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. బయటకు వెళ్లి వచ్చిన మిత్రులకు మహేష్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

ఆ గదిలో పోలీసులకు సూసైడ్‌ నోట్‌ కూడా దొరికింది. ఆ నోట్‌లో ఉద్యోగం పేరుతో మిత్రులు మోసం చేశారని తెలిపాడు. అంతేకాక నోట్‌లో పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement