
అరెస్టయిన మారిముత్తు
అన్నానగర్: కోవిల్‌పట్టిలో ఆదివారం సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యా బెదిరింపులు చేసిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిల్‌పట్టి సమీపం వానరముట్టి ఉత్తర వీధికి చెందిన సంగయ్య కుమారుడు మారిముత్తు (30), వ్యాన్ డ్రైవర్. ఇతనికి కనక అనే భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మారిముత్తు శనివారం రాత్రి బైక్‌పై వానరముట్టి సమీపంలో వెళుతుండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు అడ్డుకుని అసభ్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో మారిముత్తు ఆవేశంతో పోలీసుల తీరుకు నిరసనగా వానరముట్టి అంబలవీధిలోని 200అడుగుల సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న కోవిల్‌పట్టి జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ జభరాజ్, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మారిముత్తుతో చర్చలు జరిపి కిందకు తీసుకొచ్చారు. మారిముత్తుపై ఆత్మహత్యా బెదిరింపు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.