
చెన్నై,టీ.నగర్: ప్రేమ నిరాకరించడంతో ఆగ్రహించిన యువకుడు ఆమె నగ్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా గండాచ్చిపురానికి చెందిన కలైయరసన్ (24) వండిపాళ్యంలో బంధువు ఇంట్లో ఉంటూ కడలూరులోని సెల్ దుకాణంలో పనిచేస్తున్నా డు. అదే షాపులో పనిచేస్తున్న యువతితో ప్రే మ ఏర్పడింది. వీరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో యువతి ఇంట్లో వ్యతిరేకించారు. దీంతో యువతి కలైయరసన్‌తో మాట్లాడడం ఆపేసింది. దీంతో ఆగ్రహించిన కలైయరసన్ యువతి తనకు పంపిన నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కడలూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి కలైయరసన్‌ను అరెస్టు చేశారు. అతని ఫేస్‌బుక్ అకౌంట్‌ను స్తంభింపజేశారు.