
మృతురాలు వరలక్ష్మి.. నిందితుడు సమరసింహారెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రేమ వేధింపులు తాళ్లలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మొయిళ్ళ కాల్వం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మి (19) ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సమరసింహారెడ్డి అనే యువకుడు ప్రేమ పేరిట వరలక్ష్మిని వేధిస్తున్నాడు.
తాజాగా అతని వేధింపులు ఎక్కువ కావడంతో.. అతని వల్ల తన కుటుంబానికి ఏమైనా హాని జరుగుతుందని వరలక్ష్మి భయపడినట్టు తెలుస్తోంది. ఆ భయంతోనే విషగుళికలు తిని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని కడపలోని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.