కట్నం తేలేదని మహిళపై దారుణం..

Women Thrown On Railway Tracks For Dowry - Sakshi

పట్నా : కట్నం​కోసం ఓ మహిళ పట్ల భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అనాగరికంగా వ్యవహరించారు. కట్నం కింద రెండు లక్షల రూపాయల నగదుతో పాటు బైక్‌ తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయడంతో పాటు వాటిని సమకూర్చలేదని బాధితురాలిపై భర్త, అత్తింటి వారు అత్యంత పాశవికంగా దాడికి తెగబడిన ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో వెలుగుచూసింది.

కట్నం తీసుకురానందుకు రాడ్‌తో ఆమె శరీర భాగాలపై వాతలు పెట్టడంతో పాటు ఆమె జుట్టును కత్తిరించి తీవ్రంగా హింసించారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితురాలిని రైల్వే ట్రాక్‌పై పడవేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత స్ధానికులు ఆమెకు సాయం అందించి సమీప ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని, ఆమె శరీరంపై ఏడు చోట్ల తీవ్ర గాయాలున్నాయని, పలు శరీర భాగాల్లో కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top