breaking news
torcher
-
మెన్ ఇన్ 2025: వచ్చే ఏడాదైనా...మేల్ ఎంచుదాం!
‘వాడికేం మగాడు’ అనేవారు గతంలో. ‘అయ్యో... మగాడు’ అనేలా ఉన్నాయి రోజులు అనుకుంటున్నారు పురుషులు. 2025 సంవత్సరం పురుషుడిని మరింత ఒంటరిని చేసిందని పరిణామాలు చెబుతున్నాయి. ‘అవతార పురుషుడు’, ‘ఆపద్బాంధవుడి’గా గతంలో చెప్పబడిన పురుషుడు నేడు సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడని నిపుణులు అంటున్నారు. 2025లో పురుషుడి స్థితిగతులపై ఓ నజర్.మగాడి కోసం రెండు ప్రయివేటు బిల్లులు2025 ముగిసి, 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ 365 రోజుల జీవితాన్ని మొత్తం తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అని పురుషులని అడిగితే ‘అసలు తరచి చూసే అవకాశం, తీరిక మాకెక్కడిదీ’ అనేది పురుషుల మాట. హడావిడి, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, సామాజిక వ్యవహారాలు, ఆర్థిక కష్టనష్టాలు... అన్నీ కలిపి నిమిషం తీరిక లేకుండా చేస్తే ఇక జీవితం ఎలా సాగుతోందో చూసి, అంచనా వేసే అవకాశం ఎలా ఉంటుంది? 2025లో పురుషుల సమస్యల మీద అనేకమంది వైద్య నిపుణులు, సామాజికవేత్తలు గొంతెత్తారు. ఆధునిక జీవనంలో అబ్బాయిల పరిస్థితి అధ్వానంగా మారిందని, సమస్యలు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక వారు అవస్థ పడుతున్నారని పేర్కొన్నారు. అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. రీల్స్‌లో ఒక జోక్... నలుగురు మగవారు ‘గోవాకు వెళదాం’ అని ΄్లాన్ చేస్తూ ఉంటారు. కలిసినప్పుడల్లా గోవా ΄్లానే. కాని సంవత్సరాలు గడిచిపోతాయిగానీ గోవాకు మాత్రం వాళ్లు వెళ్లరు. నిజానికి గోవాకు వెళ్లడం పెద్ద విషయం కాదు. తగినన్ని డబ్బులు అందరి దగ్గరా ఉంటున్నాయి. కాని కదల్లేని మెదల్లేని పరిస్థితులు నేడు పురుషుడి కనీస సరదాలను కూడా తీర్చడం లేదు.‘మగాళ్లు పైలాపచ్చీసు’గా తిరుగుతుంటారు అనేది పాతమాట. కనీసం రెండురోజుల లీవ్ దొరకని ఉద్యోగాల్లో వాళ్లు ఒళ్లు హూనం చేసుకుంటున్నారని ఎవరికి తెలుసు?రైట్ టు డిస్ కనెక్ట్ బిల్మగవారు ఆఫీసులో ఉన్నంత సేపే డ్యూటీ చేసినట్టు కాదు.. ఇంటికొచ్చాక కూడా కాల్స్ అటెండ్ చేస్తూ ఆఫీస్ పని చేస్తూ అదనపు డ్యూటీ చేస్తూనే ఉంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు సర్వసాధారణం. మగవారికే కాదు పురుష/మహిళా ఉద్యోగులందరికీ పని గంటల తర్వాత ఆఫీసుతో డిస్కనెక్ట్ అయ్యే హక్కును ప్రతిపాదిస్తూ ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ను ప్రయివేటు బిల్లుగా 2025లో పార్లమెంట్ మెంబర్ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. అత్యవసర సేవల్లో ఉంటే తప్ప ప్రతి ఉద్యోగంలో ఇలా డిస్కనెక్ట్ అయ్యే సౌలభ్యం మగవారికి ఉంటే వారు మరింత క్వాలిటీ లైఫ్‌ను అనుభవించగలరు.జాతీయ పురుషుల కమిషన్ పురుషుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించే చట్టబద్ధమైన సంస్థను రూ΄÷ందించడానికి ఈ ఏడాది తొలి ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 6న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ‘జాతీయ పురుషుల కమిషన్ బిల్లు’ను ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టారు. పురుషులపై చట్టపరమైన వివక్ష, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ చట్టాలలో పక్షపాతాలు, కొన్ని నేర నిబంధనల దుర్వినియోగాన్ని పరిశీలించడానికి సంస్థాగత యంత్రాంగం కావాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇలాంటి కమిషన్ ఉండాలని ‘భార్యా బాధితులు’ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 2025లో కొన్ని భరణం కేసులు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయే విధంగా కోర్టు ముందుకు వచ్చాయి.ఆయుష్షు తక్కువ‘నూరేళ్లు వర్థిల్లు’ అనుకోవడమే గాని పురుషుడి ఆయుష్షును తగ్గించే విషయాల గురించి చింత ఉండటం లేదు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుష్షు నాలుగు సంవత్సరాలు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం దేశంలో సగటు ఆయుర్దాయం ఇప్పుడు 70.3 సంవత్సరాలు. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కేరళలో 75.1 సంవత్సరాలతో అత్యధికంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే, పురుషుల ఆయుర్దాయం జమ్మూ కాశ్మీర్లో 73.4 సంవత్సరాలు కాగా, మహిళలకు కేరళలో 78.4గా ఉంది. అత్యంత తక్కువ ఆయుర్దాయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. అక్కడ పురుషులకు 62.4 సంవత్సరాలు కాగా, మహిళలకు 67.1 సంవత్సరాలు. పురుషుల మరణాలకు ప్రధాన కారణంగా హృదయ సంబంధ వ్యాధులే కావడం గమనార్హం.పాపం ఒక్కడుఅవును! ఇంటికి అతను ఒకే ఒక్కడు. ఉమ్మడి కుటుంబాలు పోయి దేశంలో చిన్న కుటుంబాల వ్యవస్థ మొదలైన తర్వాత భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అనే సంస్కృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మగవాడు భర్త బాధ్యతనంతా భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య అతనికి సహకరిస్తున్నా పని ఒత్తిడి, బాధ్యతలు నిమిషం ఖాళీగా ఉంచడం లేదని నిపుణులు అంటున్నారు. పనులు పంచుకునేవారు లేక, కాసింత విశ్రాంతి దొరకక చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని అంటున్నారు. 2025లో పురుషుల మానసిక సమస్యల గురించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్యం అతడికే... జరిమానాలు అతడికే...పురుషుడు పని చేయాలంటే కాలు బయట పెట్టాలి. బయట అడుగుపెడితే కాలుష్యం, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.... ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే మన దేశంలో అత్యధిక పురుషులు టూ వీలర్ల మీద తిరుగుతూ కాలుష్యం బారిన పడుతున్నారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం వీరి సమస్య. చూపు మందగించడం, చర్మం ముడతలు పడిపోవడం వంటి సమస్యలకు లెక్కలేదు. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో చాలామంది పురుషులు చిన్నవయసులోనే బీపీ, డయాబెటిస్ బారిన పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు పురుషుల్లో సర్వ సాధారణం. ఇక వీరు ట్రాఫిక్ జరిమానాల బారిన పడుతూ అవి కట్టలేక చేసే ఆర్తనాదాలకు అంతు లేదు.బెట్టింగ్ బర్బాదీబెట్టింగ్ యాప్స్ ఎరకు చిక్కుకున్న పురుషుల పెను విషాదాలు 2025లో అత్యధికం చోటు చేసుకున్నాయి. మద్యం, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకున్నవారు కూడా సులభదారుల్లో డబ్బు వస్తుందని బెట్టింగ్ యాప్స్‌కు చిక్కుకుని ్రపాణాలు కోల్పోతున్నారు. వీరిలో యువకులు ఎక్కువ ఉంటే సైబర్ మోసగాళ్ల చేత చిక్కి వారు పెట్టమన్న చోట పెట్టుబడులు పెట్టి కోట్లు నష్టపోయిన వారిలో అనుభజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉన్నారు. జీవన తాత్త్వికత, జీవన సౌలభ్యాలు తెలుసుకోకుండా అసలు ఎటువంటి వివేచనాపూరిత ఆలోచనలు లేకుండా ఎక్కువ సంఖ్యలో పురుషులు ఉంటూ మూక స్వభావంతో జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. గడ్డం పురుష లక్షణంఎన్ని చెప్పుకున్నా ఇప్పటికీ ఇది పురుష ప్రపంచమే. పురుషులే ఆకర్షక శక్తులుగా నిలిచే ఆనవాయితీ పోలేదు. ఒకప్పుడు పురుషులు శుభ్రంగా గడ్డం గీసుకుని కనిపించేవారు. ఇప్పుడు గడ్డం కలిగి ఉండటం పురుష లక్షణంగా మారింది. 2025లో బారు గడ్డాల సౌందర్యంతో రణబీర్ కపూర్, రణధీర్ కపూర్‌తో మొదలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో సహా విరాట్ కోహ్లీతోపాటుగా హల్చల్ సృష్టించారు. ప్రస్తుతం ‘వారణాసి’ కోసం మహేష్ బాబు కూడా గడ్డం పెంచారు. ప్రపంచవ్యాప్తంగా నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తి స్త్రీ కాదు. అమెరికన్ గాయకుడు–గేయరచయిత డేవిడ్ ఆంటోనీ బర్క్ (ఈ4ఠిఛీ). మనదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మొదటి ఐదుగురిలో నలుగురు మగవారే కావడం విశేషం. వారిలో తొలిస్థానం యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో క్రికెటర్లు ప్రియాంశ్ ఆర్య, అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు.ఎవరికీ చెప్పుకోలేక‘మగవాడివి.. నువ్వు ఏడవకూడదు’ అని చిన్ననాటి నుంచి వినే మాటలు, ఇంటా బయటా నూరిపోసే పురుష అహం ఆ సమయానికి బాగున్నా వయసు పెరిగే కొద్ది పురుషులను సతమతం చేస్తున్నాయి. దీంతో ఎంత కష్టం వచ్చినా బయటకి చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక నలిగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన అధ్యయనాల్లో అనేకమంది పురుషులు తమ తమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, చిన్న చిన్నవి బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనో, ఎగతాళి చేస్తారనో లోలోపలే దాచుకొని కుమిలిపోతున్నారని తేలింది. ఉదాహరణకు ఇంట్లో అవమానకరమైన, సూటిపోటి మాటలు ఎదురవుతుంటే ఆ పురుషుల బాధ వర్ణనాతీతంగా ఉంది.ఒక ఉద్యోగం చాలదుఒక ఉద్యోగానికే సమయం సరిపోకపోతే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి స్థలాలు– ఇళ్ల ధరలు, ఇళ్ల అద్దెలు మగవాణ్ణి మరో ఉపాధిని కూడా వెతుక్కునే అగత్యానికి నెడుతున్నాయి. ఏ.ఐ ప్రవేశం తర్వాత ఉద్యోగాలు పోతాయన్న హెచ్చరికలు వారిని అభధ్రతలో నెడుతున్నాయి. అప్పులు చేసి, వడ్డీలు కట్టక తప్పని పరిస్థితో ఈఎంఐలకు చిక్కుకోత తప్పని పరిస్థితో నెలకొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని పురుషులు ఈ ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగంతోపాటు పార్ట్‌టైం ఉద్యోగాలూ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఊబర్, ఓలా సర్వీసుల్లో ఇలాంటి మగవారు ఎందరో కనిపిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర కాచి పని చేస్తున్నారు.అనూహ్యమైన ఆమెభార్యాభర్తల అనుబంధం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనది. దాని కోసం స్త్రీ, పురుషులిద్దరూ ఎన్నో త్యాగాలకు, సర్దుబాట్లకు సిద్ధమవుతూనే ఉంటారు. అయితే గతంలో గృహహింసలో మగవారి పాత్ర వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు స్త్రీ హింస వార్తలుగా కనిపించడం మగవారికి బెంబేలు పుట్టిస్తోంది. భర్తల ్రపాణాలకు భార్య వల్ల ముప్పు ఏర్పడే పరిస్థితి రావడం 2025లో ఎక్కువ సంఘటనల వల్ల కనిపించిన సామాజిక విషాదం. ఇంత ప్రమాదం అరుదే అయినా భార్య నుంచి వేధింపులు, ఆమె కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు ఇటీవల పెరిగాయని పురుషులు చేస్తున్న ఆరోపణ. నకిలీ వేధింపులు కేసులు, వరకట్న కేసులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విడాకుల కోసమో, మరే కారణం చేతనో సూటిపోటి మాటలు అనడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల సంఖ్య పెరిగింది. -
బిగ్ న్యూస్: అనితా మేడమ్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
సాక్షి, విజయవాడ: కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీదే యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై(Tenali Police Torture) సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఈ ఘటనపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. దళితులపై పోలీస్ టార్చర్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సమర్థించడంతో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళని ఎందుకు ఇలా కొట్టలేదు మేడమ్? ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలను ఎందుకు ఇలా శిక్షించలేదు మేడమ్?దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మేడమ్?అసలు పోలీసుల దాష్టికాన్ని మీరు ఇలా ఎలా సమర్థిస్తారు మేడమ్?.. అంటూ హోం మంత్రికి పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నడుస్తున్న ప్రతీకార రాజకీయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ హోం మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో మాట్లాడిన హోం మంత్రి.. పై ఘటనలను తన వ్యాఖ్యలతో ఎలా సమర్థించుకుంటారు అంటూ నిలదీస్తున్నారు.‘‘పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ని కొంత పని చేసుకొనివ్వాలి. తెనాలిలో రౌడీ షీటర్స్ పోలీసులు పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్’’.. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించే మంత్రి అనిత నోటి నుంచి వచ్చిన తప్పుడు ప్రకటనలు.ఇదీ చదవండి: జగన్ అడిగిందేంటి.. చంద్రబాబు చెబుతోందేంటి? -
నిండా ముంచేస్తారు.. ‘యాప్గాళ్లు’
కొన్నాళ్ల క్రితం అత్యవసరమై ఓ యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకున్నా.. సకాలంలో వడ్డీ, వాయిదాలు చెల్లిస్తున్నా. రకరకాల కారణాలు చెప్పి పెనాల్టీలు వేశారు. మొత్తం రూ.9 వేలు కట్టా.. అయినప్పటికీ ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లు, సందేశాలు పంపిస్తున్నారు. నా ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ ఆధారంగా స్నేహితులు, బంధువులకు విషయం చెప్పి పరువు తీస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా.. – ఓ బాధితుడి ఆవేదన కోవిడ్ బారిన పడి క్వారంటైన్లో ఉండగా డబ్బు అవసరమైంది. దీంతో ఓ యాప్ నుంచి రూ.30 వేలు తీసుకున్నా.. వారం తర్వాత ఆ అప్పు తీర్చడానికి మరో దాని నుంచి ఇలా.. ఇప్పటికీ నా యాప్‌ల అప్పు రూ.2.7 లక్షలకు చేరింది. నా కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరితో కలిపి వాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లు క్రియేట్ చేశారు. అందులో నా ఫొటోను ఫ్రాడ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఒక యాప్ నుంచి అప్పు తీసుకుంటే.. వరుస పెట్టి మిగిలిన యాప్‌ల నుంచి ఆఫర్లు వచ్చి ఉచ్చులోకి దింపుతున్నాయి.. – నగరానికిచెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించని కాబూలీ వాలాలు వాళ్లు.. యాప్‌ల ఆధారంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్పులిస్తారు.. వడ్డీతో సహా అప్పు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యమైనా రకరకాలుగా వేధిస్తారు.. గూగుల్ ప్లేస్టోర్స్ ద్వారా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అప్పులిచ్చే యాప్స్ వ్యవహారమిది.. ఈ ‘యాప్గాళ్ల’వేధింపులు పెరిగిపోయాయంటూ 4రోజుల్లో 50మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ప్లేస్టోర్స్‌లో లెక్కకు మిక్కిలిగా.. కంటికి కూడా కనిపించకుండా అప్పులిచ్చే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్స్‌లో 250 ఉన్నాయి. ఇందులో హోస్ట్ కాకుండా లింకుల రూపంలో పనిచేసే వాటికి కొదవే లేదు. ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్, ఉదార్ కార్డ్, రెడ్ కార్పెట్..వంటివి కొన్ని మచ్చుకు మాత్ర మే. ప్రధానంగా యువత, విద్యార్థులనే టార్గెట్‌గా చేసుకుని ఆన్లైన్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే వ్యక్తి తన ఆధార్ కార్డు, పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతోంది. కొన్ని గంటల్లోనే ఆ మొత్తం సదరు వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతా లేదా..ఈ–వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. ఈ యాప్స్ రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇస్తున్నాయి. వడ్డీ, పెనాల్టీలు తదితరాలను కలుపుకుంటే నెలకు 35 నుంచి 45 శాతం వరకు వడ్డీ ఉంటోంది. వీటి నుంచి అప్పు తీసుకున్న వాళ్లు వారం నుంచి 10 రోజుల్లో రీ–పేమెంట్ చెయ్యాల్సి ఉంటోంది. ఈ చెల్లింపులకు సంబంధించి నిర్ణీత గడువుకు కొన్ని గంటల ముందు ఎస్సెమ్మెస్ వస్తుంది. అందులోని లింకు క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతాయి. (చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్) అవన్నీ తమ వద్దకు చేరటంతో.. లోన్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకునేప్పుడు మిగిలిన యాప్స్ మాదిరిగానే కాంటాక్ట్స్, ఫొటోస్, లొకేషన్ తదితరాలు యాక్సెస్ చేయడానికి అనుమతి కోరుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా అప్పు తీసుకునే వ్యక్తికి సంబంధించిన సమస్త వివరాలనూ లోన్ యాప్స్ తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. రుణం చెల్లింపులో విఫలమైతే చాలు.. బెదిరింపులకు దిగుతున్నాయి. తమ వద్ద ఫలానా వ్యక్తి అప్పు తీసుకున్నాడని, అతడో ఫ్రాడ్ అనీ కాంటాక్ట్స్ లిస్ట్‌లోని వారికి వాట్సాప్ ద్వారా సందేశాలు, ఫొటోలు పంపిస్తున్నారు. రుణగ్రస్తులకు ఫోన్లు చేసి అభ్యంతరకంగా, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే పది మంది సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడం తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది అసభ్యత ఉంటే సైబర్ కేసు.. ‘అప్పులిచ్చిన యాప్‌లను షార్క్ యాప్స్ అంటున్నారు. ఇవి సొర చేప మాదిరిగా ఓ వ్యక్తి ఆర్థికస్థితిని తినేస్తాయని అర్థం. వీటి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇవన్నీ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల కిందకు వస్తాయి. యాప్స్ నిర్వాహకులు మహిళల్ని దూషించినా, అసభ్య పదజాలంతో సందేశాలు పంపినా అది ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కిందకు వస్తుంది. ఇలాంటి కేసుల్ని నమోదు చేస్తున్నాం.. మిగిలిన ఫిర్యాదుల్లో ఐపీసీలోని 506 సెక్షన్ లేదా తెలంగాణ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా రుణం అవసరమైనప్పుడు ఆర్బీఐ అధీనంలో ఉండే సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి’. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, -
అప్పగింతల కర్ర
అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’ ‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’ ‘అణకువగా ఉండు బంగారం..’ ‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’ అన్నీ చెప్పాల్సిన మాటలే. వీటితో పాటు.. ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది. అప్పగింతల కర్ర! ధీమాకు.. ధైర్యానికి. అతడింకా నోరు విప్పలేదు. ‘నువ్వేనా నీ భార్యను చంపింది?’ ‘అవును’. ఎలా చంపావు? ‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’. ‘పాము ఎక్కడిది నీకు?’ ‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’. ‘పాములోళ్లు నీకెలా తెలుసు?’ ‘యూట్యూబ్‌లో అడ్రస్ పట్టుకున్నాను’ ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి? అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే? ∙∙ కట్నంగా ఐదు లక్షల క్యాష్ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్–వ్యాన్ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అతడిది. ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్రూమ్లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది. ∙∙ అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి. భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు. పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్ -
కట్నం తేలేదని మహిళపై దారుణం..
పట్నా : కట్నంకోసం ఓ మహిళ పట్ల భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అనాగరికంగా వ్యవహరించారు. కట్నం కింద రెండు లక్షల రూపాయల నగదుతో పాటు బైక్ తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయడంతో పాటు వాటిని సమకూర్చలేదని బాధితురాలిపై భర్త, అత్తింటి వారు అత్యంత పాశవికంగా దాడికి తెగబడిన ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో వెలుగుచూసింది. కట్నం తీసుకురానందుకు రాడ్‌తో ఆమె శరీర భాగాలపై వాతలు పెట్టడంతో పాటు ఆమె జుట్టును కత్తిరించి తీవ్రంగా హింసించారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితురాలిని రైల్వే ట్రాక్‌పై పడవేశారు. స్పృహలోకి వచ్చిన తర్వాత స్ధానికులు ఆమెకు సాయం అందించి సమీప ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని, ఆమె శరీరంపై ఏడు చోట్ల తీవ్ర గాయాలున్నాయని, పలు శరీర భాగాల్లో కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్!
-
ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్!
హైదరాబాద్:ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్ ఏదొక రూపంలో అధికమవుతూనే ఉంది. టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్ కు అద్దం పడుతోంది. శనివారం రాత్రి న్యూధనుంజయ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరింది. 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆ బస్సు ఒక్కసారిగా పటాన్ చెరువు వద్ద నడిరోడ్డిపై ఆగిపోయింది. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బస్సు యాజమాన్యం చేతులెత్తేసి తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. దీంతో ఆదివారం ఉదయం 9 గం.లకు వరకూ ప్రయాణికులు రోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, గర్భిణిలు ఉన్నా వేరే వెహికల్ ను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ఈ ఉదంతాన్ని చూస్తే ప్రైవేట్ ట్రావెల్సా మజాకా? అన్నట్లు ఉంది కదూ.. -
నిజం చెప్పిన పాపానికి...వాతలు..!


